ఉక్రెయిన్‌ యుద్ధంతో కష్టాలు పడుతుంటే.. వారికి మాత్రం బిరియానీలు, పాయసాలు! | Karnataka: Revenue Minister Ashok Slams Congress Over Mekedatu Padayatra | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ యుద్ధంతో కష్టాలు పడుతుంటే.. వారికి మాత్రం బిరియానీలు, పాయసాలు!

Mar 4 2022 4:01 PM | Updated on Mar 4 2022 4:06 PM

Karnataka: Revenue Minister Ashok Slams Congress Over Mekedatu Padayatra - Sakshi

మైసూరు: ప్రజలు కరోనాతో పాటు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్‌ నాయకులు మేకెదాటు పాదయాత్ర పేరుతో రోడ్ల పైన నృత్యాలు చేస్తూ బిరియానీలు తింటు, పాయసాలు తాగుతూ ఉత్సవాలు జరుపుకుంటున్నారని రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ విమర్శించారు.

గురువారం మైసూరు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం తదితరాలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులు అవేమీ పట్టించుకోకుండా రోడ్లపై ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మేకెదాటు పాదయాత్ర వల్ల కాంగ్రెస్‌ పార్టీ మరింత నాశనం అవుతుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement