బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

Kanna Lakshminarayana Resigns To Bjp - Sakshi

సాక్షి, గుంటూరు: ఏపీలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో  తన రాజీనామాను ప్రకటించారు.

కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయన్నారు. సో​ము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయి. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. జీవీఎల్‌పై కూడా లక్ష్మీనారాయణ పరోక్ష విమర్శలు చేశారు. ఓవర్‌ నైట్‌ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

కాగా, గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. సోము వల్లే పార్టీ ఎదగడం లేదని విమర్శించారు. తన వర్గానికి చెందినవారికి పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని గతంలో కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top