టీడీపీ కడప ప్రధాన కార్యదర్శి అరెస్టు

Kadapa TDP President Hari Prasad Arrest - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. 2003 కు సంబంధించిన పాత కేసు విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా రాజంపేటకు చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి హరిప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, చట్టానికి అందరూ అతీతులే అన్న విషయాన్ని మరచి హరిప్రసాద్‌ పోలీసులపై చిందులు తొక్కారు. వారిపై తిరగబడ్డారు. అయినప్పటికీ సంయమనంతో వ్యవహరించిన పోలీసులు... బందోబస్తు మధ్య ఆయనను రాజంపేట కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. సబ్ జైలుకు తరలించారు.

బురదజల్లే యత్నం
టీడీపీ జిల్లా నాయకుడు హరిప్రసాద్ మీడియా ద్వారా బెదిరింపులకు దిగుతున్నాడని శ్రీ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బయ్య అన్నారు. ప్రభుత్వం పై బురదజల్లడానికి తనను రాజకీయ నేతగా చిత్రికరిస్తున్నారని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. సాయి ఏడ్యుకేషన్ సోసైటి ఆస్తులు అడ్డదారిలో అమ్ముకోవడంపై ఫిర్యాదు చేశాం. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం న్యాయం జరగలేదు. ఇప్పుడు ఫిర్యాదులో భాగంగా విచారిస్తే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’అని సుబ్బయ్య పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top