కేసీఆర్‌ బహిరంగ సభాస్థలిని పరిశీలించిన కర్నె ప్రభాకర్‌

GHMC Elections 2020 Karne Prabhakar About KCR Public Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 28న, శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రేపటి సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్‌ల నుంచి వేల మంది ప్రజలు సభకు హాజరవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక గేట్ల ద్వారా లోపలికి వస్తారు. ఎక్కువ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకే సభా ప్రాంగణానికి రావాలని ప్రజల్ని కొరుతున్నాను. కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్కులు, శానిటైజర్‌లు కూడా ఏర్పాటు చేశాము’ అన్నారు ప్రభాకర్‌. (చదవండి: 28న హైదరాబాద్‌లో హై వోల్టేజీ )

ఇక ‘సిటీ నలుమూలల నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజల సభకు హాజరుకానున్నారు. వారందరి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసాం. సభ లో ప్రత్యేక ఎంక్లోజర్‌లను ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటించాలి. సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. ప్రజలు వీక్షించేందుకు 12 ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు చేశాం. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారని’ కర్నె ప్రభాకర్‌ తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top