బీజేపీలో చేరిన విఠల్‌

Former TSPSC Member Vittal Joined In BJP Presence Mukta Abbas Naqvi - Sakshi

సాక్షి, ఢిల్లీ: టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు, ఉమ్మడి ఏపీలో ఎన్జీవో నేత సీహెచ్‌ విఠల్‌ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి.. విఠల్‌కు కండువా కప్పి, ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ పుష్పగుచ్చం అందించి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.

చదవండి: బీజేపీపై సంచలన ఆరోపణలు: కేబినెట్‌ బెర్త్, డబ్బు ఇస్తామన్నారు!

విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలున్న ఆయన మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు. టీఆర్‌ఎస్‌ ఏర్పడక ముందు నుంచే ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకం విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని గళమెత్తారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా గతేడాది దాకా పనిచేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top