సీఎం రేవంత్‌కు మల్లారెడ్డి స్పెషల్‌ రిక్వెస్ట్‌..ఏంటంటే..?

Former Minister Mallareddy Comments On Kcr Revanth Reddy - Sakshi

సాక్షి,హైదరాబాద్‌:మాజీ సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సోమవారం మల్లారెడ్డి పరామర్శించారు. కేటీఆర్‌ను కలిసి కేసీఆర్‌ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.  

‘ఇంకా రెండుమూడు రోజులు తర్వాత కేసీఆర్‌ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ‍కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ కేసీఆర్‌ తెలంగాణను ఒక మోడల్‌గా తయారు చేశారు. కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు’ అని మల్లారెడ్డి అన్నారు. 

‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని సదుపాయాలు మెరుగుపడ్డాయి.లోకల్‌గా ఎమ్మెల్యే కి ఓటు వెయ్యకూడదని ప్రజలు అనుకున్నారు కానీ సీఎంగా కేసీఆర్‌ ఉండరని వారు అనుకోలేదు. కేసీఆర్‌ సీఎంగా లేనందుకు ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి  ఓకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నా’ అని మల్లారెడ్డి చెప్పారు. 

ఇదీచదవండి..సీఎం రేవంత్‌తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top