గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష | Congress Leaders Satyagraha Deeksha At Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష

Jun 7 2021 10:55 AM | Updated on Jun 7 2021 11:35 AM

Congress Leaders Satyagraha Deeksha At Gandhi Bhavan - Sakshi

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ  జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. వైద్యం కోసం ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో భయంకర పరిస్థితులు ఉన్నాయని, ప్రజలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కరోనాతో దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

చదవండి: LetsTalkVaccination: కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్‌
ఖరీదైన వైద్య పరీక్షలు ఇక ఉచితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement