అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి | Sakshi
Sakshi News home page

అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి

Published Sun, Feb 25 2024 4:03 PM

Congress Jagga Reddy Slams On KCR In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణపై ప్రేమతో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించలేదని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. కేవలం రాజకీయం కోసమే పెట్టాడని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియా చిట్చాట్‌లో మాట్లాడారు.

‘దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నా ధైర్యం చూసి.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తుంది. రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే మా టార్గెట్. దాన్ని అడ్డుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి.

..లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు బండి సంజయ్.. కవిత అరెస్ట్ అవుతుందని చెప్పిండు ఏమైంది. ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కూడా అంతా డ్రామానే. అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరాను. గాంధీ కుటుంబంపై ప్రేమతోనే కాంగ్రెస్‌లో చేరాను. రాహుల్ అంటే నాకు పిచ్చి.. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్‌ను ప్రధానమంత్రి చేయడం కోసం నిర్విరామంగా పనిచేస్తా’ అని జగ్గారెడ్డి తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement