
సాక్షి, ప్రకాశం జిల్లా: యర్రగొండపాలెం టీడీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. టీడీపీ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబుకు వ్యతిరేకంగా టీడీపీ నేత డాక్టర్ మన్నే రవీంద్ర వర్గం సమావేశం నిర్వహించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో అవినీతి మితిమీరిపోయిందంటూ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై టీడీపీ నేత డాక్టర్ మన్నే రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. ఎరిక్షన్ బాబుపై టీడీపీ అసమ్మతి నేతలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉపాధి హామీ పని పెట్టాలంటే.. ఒక మనిషికి వారానికి 300 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ మన్నే రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. మహానాడు వరకు టైం ఇస్తున్నాం.. తర్వాత మేమేంటో చూపిస్తాం అంటూ మీడియా సమావేశంలో టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ మేల్కొని యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని.. గాడిలో పెట్టాలంటూ రవీంద్ర వ్యాఖ్యానించారు.