ప్రజలకు చంద్రబాబు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో : అయ్యన్న పాత్రుడు

Chintakayala Ayyanna Patrudu Hot Comments TDP Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీలో అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విశాఖలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయ్యన్న మాట్లాడుతూ.. 'మూడేళ్లు పుట్టల్లో దాక్కున్న బురద పాములు మళ్లీ బయటకు వస్తున్నాయి. ఆ పాములు ఎవరో మీకు తెలుసు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పాములు పుట్టలో దాక్కున్నాయి. కార్యకర్తల మీద, పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు నోరు మెదపలేదు. మూడేళ్ల తర్వాత చంద్రబాబు పక్కన కూర్చుని ఫోటోలుకు పోజులు ఇస్తున్నారు.

ఇటువంటి వారిని చంద్రబాబు నాయుడు ప్రోత్సహించొద్దు. బురద పాములను పక్కన కూర్చోబెట్టుకుని ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. పార్టీ కోసం కష్టపడిన నాయకులు చాలామంది ఉన్నారు వారిని గుర్తుపెట్టుకోవాలి' అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఆ పార్టీలో అలజడి రేపుతున్నాయి. 

చదవండి: (మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top