బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా? | Chandrababu Is Deceiving The Bcs: Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?

Oct 9 2026 6:37 PM | Updated on Oct 9 2026 6:52 PM

Chandrababu Is Deceiving The Bcs: Botsa Satyanarayana

సాక్షి, విజయనగరం: బీసీలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవోతో రిజర్వేషన్‌ రాదని తెలిసినా కోర్టులకు వెళ్లారు. జీవో కాదు.. రాజ్యాంగ సవరణ చేయాలని  మొదటి నుంచి చెప్తున్నాం. గత స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ పారిపోయింది’’ అని బొత్స గుర్తు చేశారు.

‘‘మాకు దమ్ము ఉంది కాబట్టే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం. బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?. వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చామో చెబుతాం. టీడీపీ.. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చిందో లెక్కలు తీయాలి. మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలిచ్చారు?. సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌ అనడానికి సిగ్గుందా?

..న్యాయపరంగా బీసీ రిజర్వేషన్ ప్రక్రియ చేయలేదు. ఈ మోసాలను ఇకనైనా చంద్రబాబు ఆపాలి. ఇకనైనా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటుతో కాకుండా జీవితం గడపాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు తప్పు అని ఆ రోజే చెప్పాం. మేము ఎన్నికలను అడ్డుకోలేదు. జరపాలనే చెప్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు.

‘‘ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్లలో కూరగాయల ధరలు సుమారు 62 శాతం పెరిగాయని ప్రసంగంలో పేర్కొన్నారు. నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

..విద్యుత్ సరఫరా సమస్యలు, ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రచారానికే పరిమితం కావడం సరికాదు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. లేదంటే ప్రజలకు సమాధానం చెప్పాలి. బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఈసీకి వైఎస్సార్‌సీపీ 3 కీలక లేఖలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement