లక్నో: మోదీ వెళ్లిపోతే.. సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఏఏ మోదీ గ్యారెంటీ అనిర, దానిని ఎవరూ తొలగించలేరని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఉత్తర ప్రదేశ్ అజాంఘడ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
మోదీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం ఉంది. సీఏఏ(CAA) చట్టమే మోదీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ. సీఏఏ కింద భారత పౌర సత్వం ఇవ్వడం మొదలైంది. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ లక్షలమంది శరణార్థులు ఉన్నారు. వాళ్లందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్లిపోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, మోదీ గ్యారెంటీని ఎవరూ చెరపలేరు.
విపక్ష కూటమి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోంది. కానీ, ప్రజలంతా బీజేపీ, ఎన్డీయే కూటమితోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోంది. అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్. మోదీ గ్యారెంటీ కశ్మీర్‌లోనూ కనిపిస్తోంది. కశ్మీర్‌లో శాంతికి గ్యారెంటీ ఇచ్చాం. కశ్మీర్‌లో తీసుకున్న చర్యలతో విపక్షాల నోళ్లు మూతలు పడ్డాయి. మోదీ వెళ్తే ఆర్టికల్ 370 రద్దు కూడా పోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ, నాల్గొ దశలో జరిగిన పోలింగ్‌లో శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు అని ప్రధాని మోదీ అన్నారు.
దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా ఆజాంఘడ్ గురింంచి చర్చ వచ్చేది. స్లీపర్‌సెల్స్ గురించి చర్చ జరిగేది. సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడూ ఆజాంఘడ్ గురించి ఆలోచించలేదు. ఆజాంఘడ్‌లో కమలం వికసిస్తేనే.. అభివృద్ధి జరుగుతుంది అని ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఇండియా కూటమి రిజర్వేషన్లతో రాజకీయం చేస్తోంది. 50 శాతం బడ్జెట్‌ను మైనారిటీలకు కేటాయించాలనుకుంటోంది. 70 ఏళ్లుగా హిందూ, ముస్లిం అంటూ మతాల పేరిట వాళ్లు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రామమందిర ప్రారంభం నాడు ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసింది. పేదల అభివృద్ధి కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా. మీ బాధలన్నింటిని తొలగిస్తున్నాం. వివిధ పథకాలతో పేదలను ఆదుకుంటున్నాం అని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment