దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌

BRS Minister Harish Rao counter to congress leader P Chidambarm - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణాల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య  విమర్శల వేడి రాజుకుంటోంది.  ముఖ్యంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి  పీ చిదంబరం వ్యాఖ్యలపై తెలంగాణా మంత్రి హరీష్‌ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉందంటూ  ఎక్స్‌ (ట్విటర్‌)లో  ఒక  పోస్ట్‌ పెట్టారు. 

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని అపుడుఅధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ కాదా అని హరీష్‌ రావు ప్రశ్నించారు. అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయారనీ,చరిత్ర తెలియనిది కేసీఆర్‌కి కాదుచిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్  అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే సంగతిని మర్చి,అప్ప‌ట్లో మద్రాసు రాష్ట్రం ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో  బాగుందని గ్రహించాలన్నారు. అలాగే తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికల్ని పరిశీలిస్తే మంచిదని కూడా అన్నారు.  చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి  అంటే  నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని పేర్కొన్నారు. 

ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరంకు దమ్ముంటే ఆయన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్ . సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆర్ అంటూ ట్వీట్‌ చేశారు.  ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీనే దీవించబోతున్నారు అంటూ  ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాగా తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు భారీగా పెరిగిందని చిదంబరం కేసీఆర్‌ సర్కార్‌పై ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడిన ఆయనతెలంగాణ అప్పు రూ.3.66లక్షల కోట్లకు చేరుకుందని, ప్రతి తెలంగాణ పౌరుడిపై సగటున రూ. లక్ష అప్పు ఉందని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లోనే ఎక్కువనీ, నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో  ఇంతచేసినా ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న నిధులు అరకొరగానే ఉన్నాయని విమర్శించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top