‘అసెంబ్లీ’ ఇన్‌చార్జీ్జలు పోటీ చేయొద్దు

BJP National General Secretary Sunil Bansal About Assembly Constituency In Charges - Sakshi

బాంబు పేల్చిన బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జీ్జ సునీల్‌ బన్సల్‌

ఆశావహుల్లో కలకలం

రాష్ట్రంలో పరిస్థితిని వివరించిన బండి సంజయ్‌

6 నెలలు వారి పనితీరు చూసి ఆలోచిస్తామన్న బన్సల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ నియో­జకవర్గ ఇన్‌చార్జీ్జలుగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ్జ సునీల్‌ బన్సల్‌ శనివారం ముఖ్యనేతల సమావేశంలో బాంబుపేల్చారు. దీంతో ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న కొందరు నేతలు ఒక్కసా­రిగా ఉలిక్కిపడ్డారు. అలాగైతే తాము ఇన్‌చార్జీలుగా తప్పుకుంటామని స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కలగజేసుకుని ఇక్కడున్న పరిస్థితిని, పలువురు ఇన్‌చార్జీ్జలు ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న తీరును వివరించారు. దీంతో అసెంబ్లీ ఇన్‌చార్జీల పనితీరు, సాధించిన ఫలితాలను ఆరునెలలు పరిశీలించి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని సునీల్‌ బన్సల్‌ చెప్పారు. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, జిల్లాల అధ్యక్షులు ఇతర ముఖ్యనేతలతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది.

అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీ్జలు వారి పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి ఫలితాలపై బన్సల్‌ ఆరాతీశారు. బన్సల్‌తోపాటు తరుణ్‌ఛుగ్, అర్వింద్‌ మీనన్, బండి సంజయ్, డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

పార్టీ పటిష్టానికి పాటుపడండి..
మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని సునీల్‌ బన్సల్‌ ఆదేశించారు. ప్రధానంగా మునుగోడులోని అన్ని పోలింగ్‌బూత్‌ల స్థాయిలో ప్రతీ నాయ­కుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శక్తి కేంద్రాలకు (3,4 పోలింగ్‌ బూత్‌లు కలిపి ఒక కేంద్రం) ఇన్‌చార్జిలను నియమించి పూర్తిస్థాయిలో పార్టీపటిష్టతకు కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు.

మండలాల వారీగా ఇన్‌చార్జీలు లేనిచోట్ల వెంటనే నియామకాలు చేయాలని ఆదేశించారు. వచ్చేనెల 9,10 తేదీల్లో ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’రెండోవిడత బైక్‌ర్యాలీలు ప్రారంభించాలన్నారు. 14 లోక్‌సభ నియో­జకవ­ర్గాల్లోని (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామా­బాద్‌ మినహా) రెండేసి అసెంబ్లీ స్థానాల్లో ఈ బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరిలోగా రాష్ట్రమంతా కవర్‌ చేస్తూ బైక్‌ర్యాలీలు పూర్తిచేయాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top