
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దూకుడ పెంచింది. ఈ మేరకు ఘట్‌కేసర్ సమీపంలోని పీపీఆర్ కన్వెన్షన్‌లో వర్క్ షాపు నిర్వహించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన రాంచందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వర్క్‌షాపుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ముగ్గురు ప్రధాన కార్యదర్శలతో కమిటీ ప్రకటించే అవకాశం ఉంది.