Bandi Sanjay: రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరుతారు

Bandi Sanjay Said Congress MLA Rajagopal Reddy Will Join In BJP - Sakshi

తెలంగాణలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. పొలిటికల్‌ లీడర్లు పార్టీలు మారుతూ సడెస్‌ ట్విస్టులు ఇస్తున్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. 

ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండితో రాజగోపాల్‌ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, నల్లగొండ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. అలాగే, మునుగోడు అభ్యర్థి ఎవరనేది పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు. మహాబూబ్ నగర్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ బలమెంటో అర్థం అయింది. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్‌ ఎన్నికలతో కాంగ్రెస్ ఖతమైందని ఎద్దేవ చేశారు. ఆర్థిక నేరాలు చేస్తే ఈడీ తప్పకుండా ప్రశ్నిస్తుంది. ఈడీ విచారణ చేయవద్దని కాంగ్రెస్ నేతలు అనడం హాస్యాస్పదం అని చురకలు అంటించారు. కాగా, రాజగోపాల్‌ రెడ్డి కాషాయతీర్థం పుచ్చుకుంటున్నారన్న కథనాలపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. రాజగోపాల్‌ రెడ్డి వచ్చే వారంలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top