ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్‌ తూట్లు | Bandi Sanjay in Prajahita Yatra | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్‌ తూట్లు

Mar 10 2024 1:17 AM | Updated on Mar 10 2024 1:17 AM

Bandi Sanjay in Prajahita Yatra - Sakshi

ప్రజాహిత యాత్రలో బండి సంజయ్‌  

రామడుగు/గంగాధర: గత ఎన్నికల్లో అర్హులందరికీ ఆరు గ్యారంటీ పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రె స్‌.. అధికారంలోకి వచ్చాక ఆ పథకాలకు తూట్లు పొడుస్తోందని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట, రామ డుగు, శ్రీరాములపల్లి, తిర్మలాపూర్, షానగర్‌లో బండి సంజయ్‌కుమార్‌ శనివారం పర్యటించి, వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.106.04 కోట్లు వెచ్చించి రామగుండంలో పలు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ గెలిస్తే బంగ్లాదేశ్, పాకి స్తాన్‌ నుంచి నిధులు తీసుకొస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు విడుదల చేయిస్తామని అన్నా రు. మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, బీజేపీ రామడుగు మండల అధ్యక్షుడు ఒంటెల కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతు న్న బీజేపీ నాయకుడు డబుల్‌కార్‌ రాజును బండి సంజయ్‌ పరామర్శించారు.

జీతాలివ్వడానికి డబ్బుల్లేవ్‌..
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. గంగాధరలో చేపట్టిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అంది స్తామని గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, పైసా ఇవ్వకుండా వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. సాగునీరు విడుదల చేయకపోవడంతో గంగాధర మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, తక్షణం నీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement