రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ: వైఎస్‌ జగన్‌ | AP: YS Jagan Serious On Chandrababu Govt Over Negligence Of Public Health | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ: వైఎస్‌ జగన్‌

Oct 20 2024 5:32 AM | Updated on Oct 20 2024 7:32 AM

AP: YS Jagan Serious On Chandrababu Govt Over Negligence Of Public Health

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

విజయనగరం జిల్లాలో ప్రబలిన అతిసార ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 

11మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదు

బాధితులకు పాఠశాల బెంచీల మీద చికిత్స అందించడం దారుణం  

నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలం  

లిక్కర్, ఇసుక స్కాముల్లో నిండా మునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు... 

ప్రజల కష్టాలను గాలికొదిలేశారు  

డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ‘డయేరి­యాతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. 11మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభు­త్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖ­పట్నంలలో మంచి ఆస్ప­త్రులు ఉన్నా బాధితులకు స్థానిక పాఠశాలలోని బెంచీల మీద చికిత్స అందించడం దారుణం.

నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. లిక్కర్, ఇసుక స్కాముల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్ప­టికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపో­యింది. గత మార్చి నుంచి దాదాపు రూ.1,800 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తి­వేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్‌­సీ­లలో స్పెష­లిస్టు డాక్టర్లను తీసి­వేశారు. విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌­సీలను నిర్వీర్యం చేశారు.

ఫ్యామిలీ డాక్టర్‌ ఊసేలేదు. ప్రభు­త్వా­స్ప­త్రుల్లో నాడు–­నేడు పనులు నిలిచిపో­యాయి. కొత్త మెడికల్‌ కాలేజీలను అస్తవ్యస్థం చేశారు. స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధమ­వు­తు­­న్నారు. తనవా­రికి కట్టబెట్టేందుకు చంద్ర­బాబు వాటిని ప్రయి­వేటు­పరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణా­ల­మీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement