నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్‌

AP Parishad Elections: Shock To Chandrababu In Naravaripalli - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: పరిషత్‌ ఎన్నికల్లో నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్‌ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23).. 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

చంద్రబాబుకు కుప్పం ప్రజలు షాకిచ్చారు.ఆయన నియోజకవర్గం కుప్పంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీ దారుణ ఓటమి చెందింది. నాలుగు మండల్లాలోనూ వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైఎస్సార్‌సీపీ-17, టీడీపీ -2 సాధించాయి. గుడిపల్లె మండలంలో 12కి గాను 12 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.  రామకుప్పం మండలంలో 16కి గాను 16 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. శాంతిపురం మండలంలో 18కిగాను 15 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

చదవండి:
మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌.. 
‘ప్రజలు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారు’ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top