సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తాం: పేర్ని నాని | AP Minister Perni Nani Press Meet Over Online Movie Tickets Issue | Sakshi
Sakshi News home page

సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తాం: పేర్ని నాని

Sep 14 2021 2:22 PM | Updated on Sep 14 2021 3:56 PM

AP Minister Perni Nani Press Meet Over Online Movie Tickets Issue - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం  మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టికెట్ల అంశం త్వరలో పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరగాలని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. కానీ దీనిపై కొందరు మేధావులు బయలుదేరారని, వారు దీని నేపథ్యం గమనించాలని సూచించారు. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామన్నారు. నిబంధనలకు లోబడే షోలు ప్రదర్శించాలని చెప్పారు.
చదవండి: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement