
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: ఎన్నికల హామీల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్లేటు ఫిరాయించారు. సూపర్ సిక్స్‌ను ఎగ్గొట్టేందుకు ఈసారి కొత్త రాగం అందుకున్నారు. ఇందుకు మంగళగిరి ఇవాళ జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాలు వేదిక అయ్యింది.
ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చాం. ఆరోజు బయట నుండి చూస్తే అన్నీ చేయగలుగుతాం అనిపించింది. నేను అనేకసార్లు చెప్పా. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అప్పులు చేసి సంక్షేమపథకాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాం అంటూ వ్యాఖ్యానించారాయన.
అదే సమయంలో అప్పులపైనా మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పారాయన. రాష్ట్రానికి రూ. 9.75 లక్షల కోట్లు అప్పుందంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు యూటర్న్ వ్యాఖ్యలు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే మాట్లాడారాయన. ఇప్పుడు టీడీపీ సభలోనూ అమలు చేయలేకపోతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.