Ambati Rambabu Serious Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

బ్రో సినిమాలో నన్ను కించపరిచారా లేదా?: మంత్రి అంబటి ఫైర్‌

Aug 9 2023 2:35 PM | Updated on Aug 9 2023 4:23 PM

Ambati Rambabu Serious Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్‌ అయ్యారు. ప్రాజెక్టులపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. సెల్‌ఫోన్‌ కనిపెట్టిన చంద్రబాబుకు సెల్ఫీ తీసుకోవడం కష్టమవుతోందని ఎద్దేవా చేశారు. 

కాగా, మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ కన్నా చంద్రబాబు గొప్పగా నటిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రారంభించికపోతే పోలవరం ప్రాజెక్ట్‌ ఉండేది కాదు. పోలవరాన్ని చంద్రబాబు నాశనం చేశారు. పోలవరంపై రామోజీరావు విషం కక్కుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీరావు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో జరిగిపోతున్నట్టు రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నారు. పోలవరంపై ఎప్పుడూ మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దోచుకుంది, దాచుకుంది చంద్రబాబు హయాంలోనే జరిగింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో మేము ప్రజా ధనం ఆదా చేస్తున్నాం అని స్పష్టం చేశారు. 

పుంగనూరులో పోలీసులపై హత్యాయత్నం జరిగింది. చంద్రబాబు వల్ల ఒక కానిస్టేబుల్‌ కళ్లు కోల్పోయారు. పుంగనూరు ఘటనపై సీబీఐ విచారణ అడగటం సిగ్గుచేటు. అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ వద్దన్నది ఎవరు?. ఇప్పుడు సీబీఐ విచారణ కావాలని ఎలా అడుగుతున్నారు. చంద్రబాబు హయాంలో ముద్రగడను హింసించారు. బ్రో సినిమాలో నన్ను కించపరిచారా? లేదో ప్రజలే చెప్పాలి. సినిమాల గురించి నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీరావు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement