
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చందబ్రాబు, పవన్ కల్యాణ్, ఈనాడుపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఎల్లో మీడియా పిచ్చి పిచ్చి రాతలు రాస్తోందని ఆరోపించారు. రామోజీరావు వైల్‌కాలర్ క్రిమినల్ అని అన్నారు. చంద్రబాబు ప్రాజెక్ట్‌లు సందర్శించాక వర్షాలు ఆగిపోయాయని కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి అంబటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ శృతిమించి విమర్శలు చేస్తున్నారు. వారాహి ఎక్కి పిచ్చికూతలు కూస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరిలో అసహనం కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌ల పేరుతో గత ప్రభుత్వం దోచుకుంది. రూ.834 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. చంద్రబాబు కేవలం దోపిడీ కోసమే కొన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభించారు.
రామోజీరావు వైట్‌కాలర్ క్రిమినల్..
పట్టిసీమ ప్రాజెక్ట్ మొత్తం దోపిడీనే. ఈనాడు కక్షపూరితంగా కథనాలు ప్రచురిస్తోంది. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు నమ్మొద్దు. రామోజీరావు వైట్‌కాలర్ క్రిమినల్. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియానే దండుపాళ్యం బ్యాచ్. రాష్ట్రాన్ని దోచుకుందామని ఎదురుచూస్తున్నారు. వలంటీర్లపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. వలంటీర్లను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకే పవన్ తాపత్రయం అని ఘాటు విమర్శలు చేశారు.
పవన్ గురించి రేణుదేశాయ్ చెప్పారుగా..
పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పే దమ్ముందా?. జనసేన కార్యకర్తలను పవన్ ముంచేస్తారు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారు. విశాఖపై పవన్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయి. రుషికొండను సందర్శించే పేరుతో హడావుడి చేశారు. కొండలను తొలగించి ఇళ్లు కట్టకోవడం లేదా?. పవన్‌లో అడుగడుగునా అసహనం కనిపిస్తోంది. శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోం. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే చర్యలు తప్పవు. పవన్ ద్రోహం చేశారని రేణుదేశాయ్ స్వయంగా చెప్పారు. భర్త ఎలాంటి వాడైనా భార్య సపోర్టు చేయడం సాధారణం’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్‌కు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్