గోదావరిఖని: బక్రీద్ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాతో పాటు ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బక్రీద్‌ను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నా రు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తిచెందకుండా సైబ ర్ మానిటరింగ్ చేయాలన్నారు. డీసీపీలు రాంరెడ్డి, భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె.శ్రీని వాస్, ఏసీపీ ప్రకాశ్, రమేశ్ పాల్గొన్నారు.
ధాన్యం రవాణాకు సహకరించాలి
గోదావరిఖని: రైతుల ధాన్యాన్ని సకాలంలో తరలించేందుకు లారీ యజమానులు సహకరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కోరారు. బుధవారం స్థానిక గంగానగర్‌లో ఉన్న లారీ అసోసియేషన్ కార్యాలయాన్ని గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాద్‌రావుతో కలిసి సందర్శించారు. వ్యవసాయ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలన్నారు. ధాన్యం రవా ణా సజావుగా జరిగేందుకు తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతు ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలు అందించి సహకరిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు.
దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లి: 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో 1, 5వ తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్‌లో 70 సీట్లు, 5వ తరగతి రెసిడెన్షియల్‌లో 73 సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 లోపు ఉండాలని, 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్ ప్రవేశానికి 01.06.2019 నుంచి 31.05.2020 మధ్య జన్మించి ఉండాలాని, ఒక కుటుంబం నుండి ఒకరికి మాత్రమే అర్హత ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తు ఫారాలను ఈనెల 16 నుంచి జూన్ 05 వరకు జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్‌లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను తగిన ధృవీకరణ పత్రాలతో కులం, ఆదాయం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు జతపరిచి జూన్ 06వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు అదే కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. జూన్ 10న లాటరీ పద్ధతి ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. వివరాలకు 9618844454, 9989354155 నంబర్లలో సంప్రదించవచ్చనిపేర్కొన్నారు.
కొనసాగుతున్న పరీక్షలు
పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయ ని డీఐఈవో కల్పన తెలిపారు. 1,119 మంది విద్యార్థులకు 1,053 మంది హాజరయ్యారని, 66 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్టీపీసీ ఉనికికే ప్రమాదం
జ్యోతినగర్: కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్టీపీసీ సంస్థ ఉనికికే ప్రమాదకరమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.భిక్షపతి అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ రోడ్‌లో సీఐటీయూ అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో ప్రభుత్వరంగ సంస్థల మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 14న గోదావరిఖని శ్రామిక భవన్‌లో నిర్వహించనున్న సేవ్ పబ్లిక్ సెక్టార్ జిల్లా సదస్సులో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి,రాజ్‌కుమార్, మల్లేశ్, దండ రాఘవరెడ్డి, హుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు.


