‘ఇందిరమ్మ’తో నెరవేరిన సొంతింటి కల | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’తో నెరవేరిన సొంతింటి కల

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

ధర్మారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల రామక్క ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మించుకున్న ఇంటికి బుధవారం గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ పథకం తీసుకొచ్చారన్నారు. ప్రతీ లబ్ధిదారుడికి రూ.5లక్షల నిధులు విడతల వారీగా మంజూరు చేశారన్నారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణంలో నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తిచేయాలని కోరారు. సర్పంచ్‌ దూడ ప్రియాంక, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహం, చింతల ప్రదీప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ కొడరి అంజయ్య, ధర్మపురి నియోజకవర్గం యూత్‌ అధ్యక్షుడు యశోద అజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement