ప్రాణాలు పిండేస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పిండేస్తున్నారు..

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

ఇది కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని అంబులెన్స్‌. పేదల పార్థివదేహాలను ఇళ్లకు తరలిస్తున్నారు. ఆస్పత్రులకు పేషెంట్లనూ తీసుకొచ్చి, మళ్లీ తీసుకెళ్లేందుకూ వినియోగిస్తున్నారు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు పార్థివదేహాలను తరలించేందుకు అందినకాడికి దోచుకుంటున్నారు.

కోల్‌సిటీ(రామగుండం): ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించేందుకు రవాణా చార్జీలు అధికంగా వసూలు చేస్తున్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు.. పార్థివ దేహాలను తీసుకెళ్లేందుకూ కుటుంబ సభ్యుల నుంచి ముక్కుపిండి మరీ వ సూళ్లకు తెగబడుతున్నారు. ముఖ్యంగా గోదావరిఖ ని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌) వద్ద కొంద రు డ్రైవర్లు సిండికేట్‌గా ఏర్పడ్డారు. బాధలో ఉన్నా రనే కనీస కనీకరం కూడా లేకుండా మృతుల కు టుంబ సభ్యుల జేబులు ఖాళీ చేస్తున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వద్ధురాలి మృతదేహాన్ని 2.6 కి.మీ.దూరంలోని గోదావరిఖనిలోని అశోక్‌నగర్‌ తరలించడానికి ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ ఏకంగా రూ.1,500 వరకు వసూలు చేయడం ఆర్థిక దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోంది. తక్కువ దూ రమే ఉన్నా.. తమ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అధిక మొత్తం డిమాండ్‌ చేశారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడం, మృతదేహాన్ని త్వరగా ఇంటికి తీసుకెళ్లాల్సి రావడంతో డ్రైవర్‌ అడిగిన మొత్తం చెల్లించక తప్పలేదని కన్నీటిపర్యంతమయ్యారు.

‘సిండికేట్‌’లో సిబ్బంది హస్తం?

ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల దోపిడీ వ్యవహారంలో జీజీహెచ్‌లోని కొందరు సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్లతో కొందరు సిబ్బంది నేరుగా టచ్‌లో ఉంటున్నారు. పేషెంట్లను కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ తదితర దూరప్రాంతాల్లోని ఆస్పత్రులకు రెఫర్‌ చేయాల్సి వచ్చినా.. ఆస్పత్రి నుంచి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లాల్సి వచ్చినా.. ‘నాకు తెలిసిన అంబులెన్స్‌ డ్రైవర్లు ఉన్నారు.. తక్కువ చార్జీ తీసుకుంటారు’ అని బాధిత కుటుంబ సభ్యులకు చెబుతూనే, డ్రైవర్లకు సమాచారం అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న అంబులెన్స్‌ డ్రైవర్లు క్షణాల్లో ఆస్పత్రికి చేరుకుని రేట్లు నిర్ణయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇందుకు కమీషన్ల వ్యవహారమే కారణమంటున్నారు. ఆస్పత్రుల్లో ధరల పట్టిక లేకపోవడంతో డ్రైవర్లు అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా మరో కారణమని అంటున్నారు.

పార్థివ దేహాలను తరలించేందుకు అధిక వసూళ్లు

‘ఖని’ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల ఇష్టారాజ్యం

జీజీహెచ్‌లో ఉచిత సేవల వాహనం అందుబాటులో లేకపోవడమే కారణం

Advertisement
 
Advertisement
Advertisement