నాణ్యమైన ధాన్యం తూకం వేయాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన ధాన్యం తూకం వేయాలి

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: నాణ్యమైన ధాన్యం తూకం వేయాలని, ఆ వెంటనే లారీల్లో లోడ్‌ చేయాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ అధికారులతో కలెక్టరేట్‌లో ఆయన బుధవారం సమీక్షించారు. హమాలీ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పూర్తిచేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్‌ చేయాలని అన్నారు. జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీ 80 శాతం పూర్తయిందని, 92 శాతానికి పెంచాలని తెలిపారు. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. ఇందుకోసం పెద్దపల్లి, పొత్కపల్లి, రేగడిమద్దికుంట, ధర్మారం, జూలపల్లి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

6న మెగా జాబ్‌ మేళా

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మే 6న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. జాబ్‌ మేళాను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రంగంపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుటగల వెంకటపద్మ ఫంక్షన్‌ హాల్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వివరించారు. డీఈఈట్‌, టాస్క్‌ సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు హాజరై అర్హులను ఎంపిక చేస్తాయని చెప్పారు. గ్రాడ్యుయేట్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెడ్పీ సీఈవో నరేందర్‌, డీఆర్డీవో కాళిందిని, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement