పశువుల కోసం ప్రత్యేక శిబిరాలు
పెద్దపల్లి: పశువులు రోగాలబారిన పడకుండా శిబి రాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పశువుల వ్యాధులకు కారణాలు, చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 1 నుంచి 7 వరకు జిల్లావ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. దీనికిగాను 28 బృందాల్లో 140 మందితో పాటు స్థానికంగా వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
శిబిరాలు ఇలా..
ఈనెల 1న పెద్దపల్లి మండలం కాసులపల్లి, నిట్టూరు, మేరపల్లి, రాఘవపూర్, పెద్దబొంకూర్, గుర్రంపల్లి, సుల్తానాబాద్ మండలం మంచరామి, కదంబాపూర్ గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2న ధర్మారం, పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని మేడారం, ఖిలావనపర్తి, కొత్తపల్లి, చందపల్లి, లోకపేట, వెంకట్రావుపల్లి, కీచులాటపల్లి, 3న ఓదెల, శ్రీరాంపూర్, పాలకుర్తి మండలాల్లోని పిట్టలఎల్లయ్యపల్లి, హరిపురం, పెద్దంపేట, మొట్లపల్లి, పుట్నూరు, కుక్కలగూడూరు, కొత్తపల్లి, గుంటూరుపల్లి, 4న రామగిరి, మంథని, అంతర్గాం, సుల్తానాబాద్, కమాన్‌పూర్ మండలాల పరిధిలో పెంచికల్‌పేట, సుందిళ్ల, కాకరపల్లి, శ్రీరాంనగర్, పెద్దంపేట, ఆకినేపల్లి, గోలివాడ, ముర్మూర్, వాగొడ్డుపల్లి, 5న ఎలిగేడు సుల్తానాబాద్, శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో సుల్తాన్‌పూర్, ముప్పిరితోట, సుద్దాల, కందునూరిపల్లి, అంకంపల్లి, ఆశన్నపల్లి, కొమిరే, నాంసాన్‌పల్లె, 6న సుల్తానాబాద్, ధర్మారం, ముత్తారం, మంథని మండలాల్లోని అల్లిపూర్, రేగడిమద్దికుంట, కటికనపల్లి, రామయ్యపల్లి, సీతంపేట, శుక్రవారంపల్లి, చందనాపూర్, సిరిపురం, 7న శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోని కూనారం, పెగడపల్లి, గుంపుల, గూడెం, నర్సాపూర్, కాట్నపల్లిలో శిబిరాలు నిర్వహిస్తారు. కాగా, జిల్లా కలెక్టర్ చొరవతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో శిబిరాలకు రవాణా సౌకర్యంతో పాటు ఉచితంగా మందులు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అధికారుల బృందంతో పాటు స్థానిక సి బ్బందికి రోజువారీగా భోజనం ఏర్పాటుకు ఎమ్మె ల్యే విజయరమణారావు సహకారం అందించారు.
ఏర్పాట్లు చేశాం
వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉచితంగా పందులు పంపిణీ చేసేందుకు కలెక్టర్ చొరవ తీసుకున్నారు. పశు వైద్య శిబిరాలు విద్యార్థులకు దోహదపడతాయి.
– విజయభాస్కర్, జిల్లా వెటర్నరీ అధికారి
పశువులు మొత్తం మగ ఆడ
ఆవులు 38,660 15,041 23,619
గేదెలు 66,131 7,916 58,215
గొర్రెలు 3,45,558 38,561 3,06,997
మేకలు 78,899 14,217 64,682
ఈ నెల 1 నుంచి 7వరకు నిర్వహణ


