ప్రశాంతంగా ఆర్టీసీ ప్రయాణం
ెపద్దపల్లి: మేడారం జాతర భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రశాంతంగా ప్రయాణం చేశారని జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల ఆర్టీసీ డిపోల మేనేజర్లు, జాతర ఇన్‌చార్జీలు కల్పన, మనోహర్, ప్రకాష్‌రావు తెలిపారు. శనివారం పెద్దపల్లి నుంచి మేడారం వెళ్లే బస్సులను నిలిపివేసినట్లు తెలిపారు. మేడారం నుంచి వచ్చే బస్సులు పెద్దపల్లిలో రిపోర్ట్ చేసి యథావిధిగా కరీంనగర్ రీజినల్ పరిధిలోని డిపోలకు పంపించినట్లు పేర్కొన్నారు. మొత్తం 671 ట్రిప్పులకు గాను 17,644 మంది ప్రయాణం చేసినట్లు వివరించారు. అధికారులు కవిత, స్రవంతి, అప్పారావు, రాజయ్య, రాములు, పాపారావు పాల్గొన్నారు.


