కోల్‌సిటీ(రామగుండం): నగరంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ స్పెషలాఫీసర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఫీజు గడువును ఈనెల 30 వరకు పొడిగించిన విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్టీపీసీ అధికారు లు కలెక్టర్‌ను కలిసి అనుమతి లేకుండా నిర్మించిన భబవనాలపై బల్దియా జారీచేసిన జరిమానాలపై చర్చించారు. ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ పెంచాలి : ఎంపీ
గోదావరిఖని: దేశంలో ని బొగ్గుగని కార్మికులతోపాటు సింగరేణి రిటై ర్డ్ ఉద్యోగుల పింఛన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. చాలీచాలని పింఛన్‌తో మలిజీవితంలో రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రతీ మూడేళ్లకోసారి పింఛన్ పెంచాలనే నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దుబే స్పందిస్తూ బొగ్గుగని కార్మికుల పింఛన్ ప్రతీ మూడేళ్లకోసారి సవరించాలనే నిబంధన ఉన్నా.. ఇప్పటివరకు సవరణ చేయలేదన్నారు. అయితే, సింగరేణి సంస్థ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన రిటైర్డ్ కార్మికులకు న్యాయం జరిగే వరకూ విశ్రమించబోనని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.
కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన
రామగిరి(మంథని): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం వెలువరించిన జీవో 21ని నిరసిస్తూ మంగళవారం సెంటినరికాలనీ మంథని జేఎన్టీయూ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు న ల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. యూ నివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అనేక ఏళ్లుగా విద్యాబోధన చేస్తున్న తమకు జీవో 21తో అ న్యాయం జరుగుతోందన్నారు. కాంట్రాక్టు అ ధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని గతఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిందని, జీవో 21ను ర ద్దు చేసి మాట నిలబెట్టుకోవాలని వారు డి మాండ్ చేశారు. ఈమేరకు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త మహేందర్, ప్రతినిధులు కుమార్, విద్యాసాగర్, వివిధ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన సదానందం, జి.శ్రీధర్, కె.తిరుపతి, జి.శ్రీకాంత్, జి.రాజేశ్‌తోపాటు 35 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.
12లోగా దరఖాస్తు చేయండి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులు ఈనె ల 12లోగా ఏఐటీటీ పరీక్షలు రాసేందుకు రూ. 100 ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారం పొందాల ని స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలిపారు. వివిధ ట్రేడ్స్‌లో మూడేళ్లకు పైబ డి పనిచేసిన అనుభవం, నైపుణ్యం ఉన్నట్లు సంస్థ నుంచి ధ్రువీకరణపత్రం, గుర్తింపుకార్డు జతపర్చాలని ఆయన పేర్కొన్నారు. దరఖా స్తు, ఇతర వివరాల కోసం వరంగల్‌లోని ములుగు రోడ్డు ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు
పెద్దపల్లిరూరల్: జాతీయ ఆరోగ్యమిషన్ కింద జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పో స్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్నకుమారి తెలిపారు. గైనకాలజిస్ట్, అనెస్తీ షియా, సైక్రియాటిస్ట్‌తోపాటు 14మంది స్టాఫ్‌నర్స్‌ను ఔట్‌సోర్సింగ్ పద్ధపతిపై భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఆ న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు


