టార్గెట్ 76 మిలియన్ టన్నులు
● 2025–26లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ● అత్యధికం కొత్తగూడెం ఏరియాకు.. ● నైనీబ్లాక్ నుంచి 4 మిలియన్ టన్నులు ● వార్షిక నివేదిక విడుదల చేసిన సింగరేణి యాజమాన్యం
గోదావరిఖని: సింగరేణి సంస్థ 2025–25 ఆర్థిక సంవత్సరం వార్షిక లక్ష్యం నివేదికను విడుదల చేసింది. ఈసారి 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. ఇందులో సింహభాగం.. 15.7 మిలియన్ టన్నులు కొత్తగూడెం ఏరియాకు కేటాయించింది. ఆ తర్వాతి స్థానంలో మణుగూరు ఏరియా ఉంది. అత్యల్పంగా అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టుకు 1.5 మిలియన్ టన్నులు కేటాంచారు.
నైనీబ్లాక్ ద్వారా 4 మిలియన్ టన్నులు
సింగరేణి సంస్థకు చెందిన ఒడిశాలోని నైనీబ్లాక్‌లో ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాన్ని భారీగా నిర్దేశించింది. బ్లాక్ ద్వారా 4 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని నిర్ణయించింది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించినా.. సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదు.


