రేపటి నుంచి శిక్షణ
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్ రూర ల్: జిల్లాలోని కొత్త సర్పంచులకు ఈనెల 19 నుంచి 23 వరకు తొలివిడత, ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు రెండోవిడత శిక్షణ ఇవ్వనున్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. చట్టాలు, వాటి అమలు తీరు తదితర అంశాలపై ఇందులో సమగ్రంగా అవగాహన కల్పిస్తామని, కొత్త సర్పంచులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఉపాధిపై వేంనూర్‌లో సర్వే
పాలకుర్తి(రామగుండం): వేంనూర్‌లో శనివా రం జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఉపాధి స్థితిగతులపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జి ల్లాలో ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో సర్వే చేపట్టారు. తొలుత సాధారణ వివరాలు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, విద్యార్హతలు, ఉద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి పొందే వారు, ఆదాయ వి వరాలు నమోదు చేశామని గణాంకశాఖ అధి కారి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తహసీల్దార్ సునీత సర్వే ప్రారంభించారు. సర్పంచ్ కోల లత, పంచాయతీ కార్యదర్శి సాయికిరణ్, ఉపసర్పంచ్ పొన్నం సంతోష్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాం
జూలపల్లి(పెద్దపల్లి): తన శిక్షణకాలంలో రైతుల సమస్యలను సాధ్యమైనన్ని పరిష్కరించానని ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్, జూలపల్లి తహసీల్దార్ బదావత్ వనజ అన్నారు. గ్రూప్–1లో 38 ర్యాంక్‌తో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించి జూలపల్లిలో డిసెంబర్ 4 నుంచి జనవరి 17వ తేదీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన వనజ.. శనివారం శిక్షణ పూర్తిచేసుకున్నారు. వనజ మాట్లాడుతూ, మరో మూడు నెలల పాటు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్‌లో శిక్షణకు వెళ్తున్నానని వివరించారు.
ప్రజల్లో చైతన్యం వచ్చేవరకూ పోరు
● మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మంథని: మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్యాయాలపై అన్నిఆధారాలను సమాజం ముందు ఉంచుతున్నామని, ప్రజల్లో చైతన్యం వచ్చేంత వరకూ తన పోరాటం ఆగదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. స్థానిక రాజగృహలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అక్టోబర్‌లో కుల సంఘాలకు భవనాలు మంజూరు చేశానంటూ పాలాభిషేకాలు చేయించుకున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు.. ఆ భవనాలకు ఈనెల 12న శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. పట్టణంలోని పోచమ్మ గుడి వద్ద మేర, పూసల, స్వర్ణకార, కుమ్మరి, నాయీబ్రాహ్మణ కుల సంఘాలకు ఒకేచోట భవన నిర్మాణం కోసం శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేశారని, ఆ ప్రాంతమంతా వాగు ఒడ్డున ఉందని, ముంపునకు గురయ్యే ప్రాంతంలో కులసంఘ భవనాలు నిర్మించడం నేమిటని ఆయన ప్రశ్నించారు. బఫర్ జోన్, నాలా, నదీ ప్రాంతాల్లోని కట్ట డాలను ప్రస్తుతం తొలగిస్తున్నారని, ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ భవనాలు నిర్మిస్తున్నామ నడంలో ఆంతర్యం ఏమిటని పుట్ట మధు ప్ర శ్నించారు. నాయకులు పాల్గొన్నారు.
కార్టూనిస్ట్‌లకు ట్రెయినింగ్
జూలపల్లి(పెద్దపల్లి): జిల్లాలోని యువ కార్టూనిస్ట్‌లకు ఈనెల 19, 20వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ కార్టూనిస్ట్‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేముల రాజమౌళి తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కరీంనగర్ ఎస్సారా ర్ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. యువతలో కార్టూన్‌పై ఆసక్తి పెంచడం లక్ష్యంగా కరీంనగర్ ఎస్సారార్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
రేపటి నుంచి శిక్షణ
రేపటి నుంచి శిక్షణ


