మానవత్వాన్ని మించిన మతం లేదు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మానవత్వాన్ని మించిన మతం లేదని ముస్లిం మత బోధకుడు మహ్మద్ ఇస్మాయిల్ అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని స్థానిక కేజీఎన్ ఫంక్షన్‌హాల్‌లో శనివారం ముస్లింలతో ముందస్తు సమావేశం నిర్వహించారు. స్వార్థం వీడితే అందరం సమానమేనన్న భావన కలిగి ఆత్మీయత పెంచుతుందని అన్నారు. అహంకారం ప్రదర్శిస్తే చివరకు తనవాళ్లకు కూడా దూరమవుతారని వివరించారు. అనంతరం కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈకార్యక్రమంలో గోరెమియా, ఫకీర్, మునీర్, రాజ్‌మహ్మద్, నజీర్, రజాక్, మస్తాన్, ఇబ్రహీం పాల్గొన్నారు.


