రామగుండం అభివృద్ధికి కృషి
గోదావరిఖని/రామగుండం/యైటింక్లయిన్‌కాలనీ/ఫెర్టిలైజర్‌సిటీ/కోల్‌సిటీ: రామగుండం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, సింగరేణి గని కార్మికుల సమస్యలపై అనునిత్యం పోరాడుతూనే, అసెంబ్లీలో 27సార్లు మాట్లాడానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. జీడీకే–2 ఇంక్లయిన్ లో కత్రోజ్ మోహన్‌బాబు, సాయికుమార్, భాస్కర్ల కిరణ్ శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్, కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. యైటింక్లయిన్‌కాలనీలో కూరగాయల మార్కెట్ ప్రారంభించారు. రామగుండంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. డిపెండెంట్ ఉద్యోగాలు కొనసాగించేలా, విజిలెన్స్ కేసులు, మారుపేర్ల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఠాకూర్ అన్నారు. ఐదు దశాబ్దాలుగా నివసిస్తున్న జెన్‌కో స్థలాలకు జీఓ.నెం.76 ప్రకారం ఇళ్ల పట్టాలు మంజూరు చేయిస్తానని, మేడిపల్లి ఓసీపీ ఎస్సీకాలనీవాసులను ఇందిరమ్మ పథకంలో చేర్పిస్తామని చెప్పారు. రామగుండంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. కాగా, రామగుండంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా పలువురు ఆశావహులు బల నిరూపణ కోసం అనుచరులతో భారీగా తరలివచ్చారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి ఆర్జీ–1జీఎం లలిత్ కుమార్, నాయకులు సింగరేణి శ్రీనన్న, జనగామ శ్రీనివాస్, అరగంటి కృష్ణ, రాసమల్ల కిరణ్, ఈదునూరి హరిప్రసాద్, అయోధ్యసింగ్‌ఠాకూర్, ఇసంపెల్లి అంజులు, మహంకాళి స్వామి, సలీంబేగ్, కన్నూరి సతీశ్‌కుమార్, మారెల్లి రాజిరెడ్డి, గుండెటి రాజేశ్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధితోనే సమాధానం
విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. రామగుండం బల్దియా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎస్‌ఈ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, కార్యదర్శి ఉమామహేశ్వర్, నాయకులు మనాలీ రాజ్‌ఠాకూర్, మహంకాళి స్వామి పాల్గొన్నారు.
జెన్‌కో స్థలాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ
ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్


