పారదర్శకంగా రిజర్వేషన్లు
● లాటరీ పద్ధతిన కేటాయింపు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల మహిళా రిజర్వేషన్ ప్రక్రియ లాటరీ పద్ధతిన, పూర్తి పారదర్శకతతో ఖరారు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్‌లో శనివారం రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లు, మిగతా మూడు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కేటాయింపులు పూర్తిచేశామన్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లోని వార్డుల్లో మార్పులు లేకపోవడంతో గతఎన్నికల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు కేటాయించామని అన్నారు. రామగుండంలో డివిజన్లు 50 నుంచి 60కి పెరగడంతో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ స్థానాలు, డెడికేషన్ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టామని వివరించారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో రొటేషన్ పద్ధతిలో వార్డుల రిజర్వేషన్ ఉంటుందని, రామగుండంలో డివిజన్ల సంఖ్య పెరగడంతో రిజర్వేషన్లు పునరావృతమయ్యే అవకాశం ఉండవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ వనజ, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, రమేశ్, మనోహర్ అధికారులు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు అయ్యప్ప ప్రసాదం
గోదావరిఖని: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అయ్యప్పస్వామి ప్రసాదం అందించారు. శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఇటీవల శబరిమల దర్శనం అనంతరం తీసుకువచ్చిన అయ్యప్పస్వామి ప్రసాదాన్ని అందించారు. అయ్యప్ప స్వామి దీవెనలు కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు.
పారదర్శకంగా రిజర్వేషన్లు


