జనరల్‌కు జై
సాక్షి,పెద్దపల్లి/కోల్‌సిటీ: జిల్లాలోని రామగుండం నగర మేయర్‌తో సహా పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాల్టీలకు చైర్‌పర్సన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి రిజర్వేషన్ల వివరాలను శనివారం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. జిల్లాలోని మూడు బల్దియాల్లో జనరల్ స్థానాలకే రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఆశావహల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రామగుండం మేయర్ పీఠాన్ని ఎస్సీ జనరల్, పెద్దపల్లి, మంథని చైర్‌పర్సన్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయించగా, సుల్తానాబాద్ చైర్‌పర్సన్ జనరల్ స్థానానికి రిజర్వే చేశారు.
రామగుండం మేయర్ పీఠం
మళ్లీ ఎస్సీ జనరల్‌కే
రామగుండం మేయర్ కుర్చీ మరోసారి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. 1995లో పురపాలక సంఘంగా ఆర్భివించిన రామగుండంలో 1997లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ద్వారా సోమారపు సత్యనారాయణ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్‌తో బడికెల రాజలింగం విజయం సాధించారు. 2010 ఫిబ్రవరిలో మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడిన రామగుండం 2014లో తొలిమేయర్ స్థానానికి ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో కొంకటి లక్ష్మీనారాయణ గెలుపొందారు. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ మేయర్ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించగా.. డాక్టర్ బంగి అనిల్‌కుమార్ ఎన్నికయ్యారు. తాజాగా ప్రకటించిన రిజర్వేషన్‌లోనూ మేయర్ స్థానం ఎస్సీ జనరల్‌కు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొదలైన చలనం..
మేయర్ పీఠం రిజర్వు కావడంతో రామగుండం నగర రాజకీయాల్లో చలనం మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్సీ జనరల్ వర్గానికి చెందిన బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. దీంతో ఎస్సీ సామాజిక వర్గం నాయకుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
మున్సిపాలిటీల్లో ఆసక్తి..
పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ స్థానాల రిజర్వేషన్ ఆసక్తిగా మారింది. తాజాగా ఖరారు చేసిన రిజర్వేషన్లతో గత ఎన్నికలతో పోల్చితే కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మూడు బల్దియాల్లో రాజకీయ సమీకరణాలు కొత్తమలుపు తిరుగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో చైర్‌పర్సన్ పీఠం మహిళా జనరల్‌గా ఉండగా, ఈసారి బీసీ మహికు కేటాయించారు. మంథని గతంలో మహిళా జనరల్‌కు ఉండగా.. ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. సుల్తానాబాద్ గతంలో బీసీ మహిళకు కేటాయించగా.. ఇప్పుడు జనరల్‌కు కేటాయించారు. మూడు మున్సిపాలిటీల్లో మారిన రిజర్వేషన్లతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. అభ్యర్థుల ఎంపికపై ఆయా రాజకీయ పార్టీల్లో అప్పుడే కసరత్తు మొదలైంది.
డివిజన్లు, వార్డులు, చైర్‌పర్సన్ స్థానాలు ఖరారు
రామగుండం మేయర్ కుర్చీ ఎస్సీ జనరల్‌కు
పెద్దపల్లి బీసీ జనరల్, మంథని మహిళా జనరల్‌కు
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ కేటాయింపు
రామగుండం మేయర్, చైర్‌పర్సన్ పీఠాలపై పలువురి ఆసక్తి


