ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది కళాకారులకు పింఛన్లు అందేవి. స్వరాష్ట్రంలో మా పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా ఎప్పుడోఓసారి డోలుదెబ్బ కళాకారులకు ప్రదర్శలిచ్చే అవకాశం లభిస్తోంది. అయినా, బతుకు కష్టంగానే ఉంది. అర్హులైన కళాకారులకు పింఛన్లు మంజూరుచేసి ఆదుకోవాలి.– కుంట సదయ్య,
కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
ప్రోత్సహించాలి
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు సులువుగా వివరించేలా మాలోని కళలను సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించాలి. మా కుటుంబ పోషణకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేదా పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – జంగిలి పోచాలు,
ఒగ్గు కళాకారుడు, రాఘవాపూర్


