● 2,627 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం ● 1,514 ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట ● 1,084 ఎకరాల్లో ధ్వంసమైన మొక్కజొన్న ● క్షేత్రస్థాయిలో సర్వేచేసిన వ్యవసాయాధికారులు ● పరిహారం అందించాలని అన్నదాతల డిమాండ్
పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్‌రూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవా రం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొ న్న, మామిడిపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోనే పంటలకు అత్యధికంగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధి కారులు గుర్తించారు. జిల్లా మొత్తంగా 1,896 మంది రైతులకు చెందిన సుమారు 2,627 ఎకరాల్లోని వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అత్యధికంగా 1,035 మంది రైతులకు చెందిన 1,514 ఎకరాల్లో వరి, 828 మంది రైతులకు చెందిన 1,084 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలిందని వారు వివరించారు.
దెబ్బతిన్న పంటలు పరిశీలించిన అధికారులు..
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, ఏడీఏ శ్రీనాథ్, ఏవో అలివేణితో పాటు ఏ ఈవోలు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టం వివరాలను ప్రాథమికంగా అంచనావేశారు. పెద్దపల్లి మండలం భోజన్నపేట, హన్మంతునిపేట, చీకురాయి, రాంపల్లి, గౌరె డ్డిపేట, ముత్తారం తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించి రైతులతో మాట్లాడారు. అత్యధికంగా వరి 1,514 ఎకరాల్లో నష్టం జరగ్గా, ఆ తర్వాత మొక్కజొన్న 1,084 ఎకరాల్లో నేలవాలిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరో 20 ఎకరాల్లో కూరగాయలు, ఇంకో 10 ఎకరాల్లో పెసర, మిరపలాంటి పంటలు నష్టపోయాయని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
చేతికందే దశలో.. చేజారింది
వరి, మొక్కజొన్న కొద్దిరోజుల్లోనే చేతికి వచ్చేవని, ఈలోగా అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు పాడై తీరని నష్టాన్ని కలిగించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దిగుబడులు సాధిస్తామన్న తమ ఆశలన్నీ అడియాసలయ్యాయని వాపోయారు. అకాల వర్షాలకు పంట నష్టం కలిగి.. దిగుబడులు తగ్గి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
వర్షపాతం వివరాలు
జిల్లాలో సరాసరి వర్షపాతం 15.3 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా ధర్మారం మండలంలో 46.8 మి.మీ. వర్షం కురరవగా అత్యల్పంగా 2.2మి.మీ. వర్షపాతం ముత్తారం (మంథని) మండలంలో నమోదైందని ముఖ్యప్రణాళికాధికారి రవీందర్ తెలిపారు. పెద్దపల్లిలో 33.0 మి.మీ., ధర్మారంలో 46.8 మి.మీ., అంతర్గాంలో 27.3 మి.మీ., పాలకుర్తిలో 3.6 మి.మీ., రామగుండంలో 8.1 మి.మీ., రామగిరిలో 19.2 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.
ఈ రైతు పేరు గుర్రం సతీశ్. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట స్వగ్రామం. తనకున్న 1.5 ఎకరా లతోపాటు మరో ఆరెకరాలను కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న వేశాడు. శుక్రవారం రాత్రి కురి సిన వడగండ్లకు రెండు పంటలూ నేలవాలాయి. కొద్దిరోజుల్లోనే పంట చేతికొస్తుందని ఆశపడితే ప్రకృతి పగబట్టిందని సతీశ్ వాపోయాడు.
వర్షార్పణం
వర్షార్పణం
వర్షార్పణం
వర్షార్పణం
వర్షార్పణం