మంథని: ఎక్లాస్‌పూర్‌లో కొద్దిరోజులుగా తాగునీరు రావడం లేదని అధికారులు దృష్టికి తీసుకెళ్ల.. మిషన్ భగీరథ, గ్రిడ్ అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. తాము కనీసం స్నానం చేయడానికి నీరు లేదని, తినే అన్నంలో మట్టి పోస్తారా? మా పరిస్థితిని అర్థం చేసుకోరా? అని గ్రామస్తులు అధికారులకు ఏకరువు పెట్టారు. గ్రిడ్ ఈఈ పూర్ణచందర్, డీఈ కిరణ్, మిషన్ భగీరథ డీఈఈ రాజ్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి నీటి సరఫరాను పరిశీలించారు. వాల్వ్‌లో మట్టి, ఇసుక నింపడంతో సమస్య వచ్చిందని వాపోయారు. సమస్య పరిష్కరానికి చొరవ చూపుతామని, గ్రామస్తులు సహకరించాలని అధికారులు కోరారు.