ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 27న ఉదయం 9గంటలకు హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఈవో సదయ్య పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తిగలవారు, భక్తులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
26న శ్రీఆదివరాహస్వామి..
కమాన్‌పూర్: మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయ హుండీని ఈ నెల 26 లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఆసక్తిగల వారు లెక్కింపులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అదే రోజు ఆలయానికి కిరాణ సామగ్రి సరఫరా చేయడానికి టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.