
మాట్లాడుతున్న నాయకులు
గోదావరిఖని: సింగరేణి క్వార్టర్లకు త్వరలో మిషన్ భగీరథ నీరిస్తామని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేశ్ తెలిపారు. సోమవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాగూర్ నేతృత్యంలో స్థానికంగా నిరుద్యోగ, వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తామన్నారు. నాయకులు మహంకాళి స్వామి, ముస్తఫా, పెద్దెల్లి ప్రకాశ్, సుతారి లక్ష్మణ్‌బాబు, కాల్వ లింగస్వామి, గట్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.