‘మమ్మల్ని తొలగించే హక్కు ఎవరిచ్చారు?’

మాట్లాడుతున్న బీజేపీ మండలాల అధ్యక్షులు - Sakshi

బీజేపీ జిల్లా  అధ్యక్షుడినే  సస్పెండ్‌ చేయాలి

విలేకరులతో  పార్టీ మండలాల  అధ్యక్షులు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలో బీజేపీ మండలాల అధ్యక్షులను ఏకపక్షంగా నియమించే అధికారం జిల్లా అధ్యక్షుడికి ఎవరిచ్చారని పెద్దపల్లి మండల అధ్యక్షుడు పర్శ సమ్మయ్య, ఓదెల అధ్యక్షుడు శనిగరపు రమేశ్‌ ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్‌ పోస్టుగా జిల్లా అధ్యక్షుడినని ప్రకటించుకుని..

మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టించేలా రాష్ట్ర కార్యవర్గంలోని ఓ నాయకుడి సూచనల మేరకు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తమను తొలగించే హక్కు ఆయనకు ఎక్కడిదని మండల అధ్యక్షులు మామిడాల రమేశ్‌, రాజు నిలదీశారు.

జిల్లా అధ్యక్షుడినని చెప్పుకుంటున్న రాజేందర్‌ కార్పొరేటర్‌ పదవికి పోటీచేసి డిపాజిట్‌ దక్కించుకోలేదని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌పై ఎంపీటీసీగా ఎన్నికై న వ్యక్తికి బీజేపీలో సభ్యత్వం లేకున్నా పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న వారిని ఇబ్బంది పెడితే తీవ్ర పరిణా మాలుంటాయని హెచ్చరించారు. నాయకులు కర్రె సంజీవరెడ్డి, పిన్నింటి రాజు, శ్రీనివాసరావు, సదానందం, జనార్ధన్‌రెడ్డి తదితరులున్నారు.

Read latest Peddapalli News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top