ఉద్యమం ఆగదు.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యమం ఆగదు..

Aug 21 2026 3:21 AM | Updated on Aug 21 2026 3:21 AM

సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమిస్తామని జూనియర్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు రేవంత్‌ స్పష్టంచేశారు. జూనియర్‌ వైద్యుల నాలుగోరోజు సమ్మెలో భాగంగా గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, మయూరి కూడలి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్సు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుల కష్టాన్ని భారంగా చూడొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. మేము చేస్తున్న సేవకు గౌరవ వేతనం ఇప్పించాలని కోరారు. న్యాయమైన సమస్యను వెంటనే పరిష్కరించేవరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జి.జశ్వంత్‌, పాత్రుడు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement