పాలకొండలోని ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతిగృహం ఇది.. చెంతనే అగ్నిమాపక శాఖ కార్యాలయం నూతన భవనాన్ని ఇటీవల నిర్మించారు. దాదాపు వసతిగృహానికి ఆనుకునే అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సంబంధించి సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నారు. వసతిగృహం ఎదురుగానే పైపులు కూడా వేస్తున్నారు. దీనిపై హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంకు ఇక్కడే ఉండడం వల్ల దోమల బెడదతోపాటు, దుర్వాసన వెదజల్లే అవకాశం ఉందని.. భవిష్యత్తులో పైపులు లీకై తే, ఆ నీరంతా ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 40 మంది వరకు విద్యార్థులున్నారు. పక్కనే బీసీ వసతిగృహం కూడా ఉండేది. ఇటీవలే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ట్యాంకు నిర్మాణం చేపడితే తమ పరిస్థితీ అదే అవుతుందని ఎస్సీ వసతిగృహ విద్యార్థులు, సిబ్బంది అంటున్నారు.
– సాక్షి, పార్వతీపురం మన్యం/
పాలకొండ రూరల్


