బెడ్‌కు ఇద్దరు రోగులు | - | Sakshi
Sakshi News home page

బెడ్‌కు ఇద్దరు రోగులు

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు ముసురుకుంటున్నాయి. చిన్నారులు, పెద్దలు తేడా లేకుండా జ్వరాలతో మంచంపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జ్వరపీడితుల తాకిడి పెరగడంతో ఆస్పత్రుల్లో బెడ్‌లు చాలడం లేదు. సీతంపేట ఏరియా ఆస్పత్రిలో ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురుకి వైద్యసేవలు

అందిస్తున్నారు. వైరల్‌ జ్వరాలతో పాటు మలేరి యా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం వైద్యులను ఆందోళనకు

గురిచేస్తోంది. – సీతంపేట

చిత్రంలో బెడ్‌పై కూర్చుని పండ్లు తింటున్న ఇద్దరు బాలుర పేర్లు మదన్‌, మనోహర్‌. సీతంపేట హైస్కూల్‌లో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థులది నౌగూడ గ్రా మం. వీరికి జ్వరం తీవ్రంగా రావడంతో సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఇద్దరికీ మలేరియా పాజిటివ్‌ వచ్చింది. బెడ్‌లు లేక గత కొద్ది రోజులుగా ఒకే బెడ్‌పై చికిత్స పొందుతున్నారు.

సీతంపేట మండలం మీనకోటకు చెందిన నీలవేణి, దీప్తిలు జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం సీతంపేట ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించారు. అప్పటికే బెడ్‌లు లేకపోవడంతో ఇద్దరికీ ఒకే బెడ్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బెడ్‌లు సర్దుబాటు చేసేందుకు వైద్యులు, సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement