సీతానగరం: మండలంలోని పెదబోగిలి పంచా యతీ అప్పయ్యపేట తోటలో రెండు రోజులు గా గజరాజులు సంచరిస్తున్నాయి. పగలంతా మామిడి తోటల్లో ఉంటూ సాయంకాలం వేళల్లో చెరకు, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయి. అటవీశాఖ సిబ్బంది గజరాజుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి పరిసర గ్రామాల ప్రజల రాకపోకలపై అప్రమత్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రికి ఆహ్వానం
విజయనగరం రూరల్: ఈ నెల 30 నిర్వహించనున్న కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) ప్రథమ స్నాతకోత్సవానికి కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆహ్వానిస్తూ ఢిల్లీలో శుక్రవారం ఆహ్వానపత్రికను అందజేసినట్టు సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ ఫోన్‌లో తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు సమ్మతి తెలిపారన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యా, అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్టు పేర్కొన్నారు.


