పోయిన మొబైల్‌ ఫోన్ల అప్పగింత | - | Sakshi
Sakshi News home page

పోయిన మొబైల్‌ ఫోన్ల అప్పగింత

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

పోయిన మొబైల్‌ ఫోన్ల అప్పగింత

రాజాం సిటీ: గతంలో పోగొట్టుకున్న ఆరు మొబైల్‌ ఫోన్లను బాధితులకు పోలీసులు శుక్రవారం అందజేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శెట్టి సురేష్‌, ధీరజ్‌కుమార్‌, పేర్ల పవన్‌కుమార్‌, కలిగి ఝాన్సీ, ఎర్ర శంకరరావు, బల్ల మహేష్‌ గతంలో ఫోన్లు పోగొట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని సీఐ కె. అశోక్‌కుమార్‌ తెలిపారు. వాటిని సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైన సెల్‌ ఫోన్‌ పోగొట్టుకుంటే సంబంధిత ఫోన్‌ కొనుగోలు చేసిన బిల్లు, ఆధార్‌ కార్డుతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement