అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పి, తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక హామీల అమలు ఊసెత్తకపోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడమే ఇది ఎంతమాత్రం తగదు. ఆడబిడ్డ నిధి కింద నెలకు ఇస్తామన్న రూ.1500లు ఇవ్వాల్సిందే.
– కడుబండి సుధారాణి ఎంపీటీసీ, గుచ్చిమి
బకాయిలతో కలిపి ఇవ్వాలి..
ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా 24 నెలల కాలం దాటేశారు. ఆ నెలల బకాయిలన్నీ పథకం అమలు చేసి లబ్ధిదారులకు చెల్లించాలి. అర్హులైన మహిళలంతా పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.
– రౌతు రాజేశ్వరి, జెడ్పీటీసీ, దత్తిరాజేరు


