రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్‌లో ఈ నెల 29న ఉచిత శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 19 నుంచి 50 సంవత్సరాలలోపు సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. సీ్త్రలకు హోమ్ నర్సింగ్ (30 రోజులు), ఫొటో అండ్ వీడియో గ్రఫీ (31 రోజులు)లలో శిక్షణ ఉంటుందని అన్నారు. పురుషులకు సెల్‌ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), ఫొటోగ్రఫీ అండ్ వీడియో గ్రఫీ (31 రోజులు), ఏసీ, రిఫ్రిజిరేషన్ (75 రోజులు), సీసీ టీవి ఇన్‌స్టాలేషన్ (13 రోజులు)లలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. శిక్షణా కాలంలో వసతి, భోజన సదుపాయం కల్పించనున్నామని, వివరాలకు 9491741129, 9866913371 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఓటు చాలా విలువైనది
చీపురుపల్లి: రాజ్యాంగంలో ఓటు చాలా విలువైందని వైస్సార్‌సీపీ జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనువాసుల నాయుడు అన్నారు. పట్టణంలోని 146వ పోలింగ్ బూత్ పరిధిలో నిర్వహించిన సర్ ప్రోగ్రాంను ఆయన పరిశీలించారు. ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు కో–ఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు తొలగించకుండా చూడాలన్నారు. ఓటర్లు కూడా ప్రతి బూత్‌లో మీ ఇంటికి వచ్చిన బీఎల్‌ఓ, బీఎల్‌ఏలకు సహకరించాలని కోరారు. తమ ఓట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని గుర్తు చేశారు. బీఎల్‌ఓ గోవింద్, బీఎల్‌ఏ రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు రేవల్ల సత్తిబాబు, కర్రోతు ప్రసాద్, పైడిరాజు, కల్కీజీవన్, రామగురువులు పాల్గొన్నారు.


