చట్టబద్ధ్ద పశు రవాణాకు రక్షణ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

చట్టబద్ధ్ద పశు రవాణాకు రక్షణ కల్పించాలి

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

చట్టబద్ధ్ద పశు రవాణాకు రక్షణ కల్పించాలి

లీగల్‌ లైవ్‌స్టాక్‌ ట్రాన్స్‌పోర్ట్‌

అసోసియేషన్‌ అధ్యక్షుడు భరత్‌

విజయనగరం ఫోర్ట్‌: చట్టబద్ద పశు రవాణకు రక్షణ కల్పించాలని లీగల్‌ లైవ్‌స్టాక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భరత్‌ అన్నారు. స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి ప్రతి రోజూ పశువుల ను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చట్టబద్దంగా రవా ణ చేస్తున్నామని తెలిపారు. ఈ రవాణా కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా రుపొందించిన లైవ్‌ స్టాక్‌ వాహనాలను వినియోగిస్తున్నామని తెలిపారు. వాహనాల్లో వెంటేషన్‌, డ్రైనే జీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, జంతువుల సంక్షేమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల ద్వారా జారీ చేయబడిన డిజిటల్‌ రూల్‌ 96 వెట ర్నరీ హెల్త్‌ సర్టిఫికెట్స్‌ సంబంధిత అధికారుల అనుమతులు, రవాణ శాఖ ధృవీకరణలు, రాష్ట్ర స్థాయి అధికారుల అనుమతులతోనే పశువుల రవాణ నిర్వహిస్తున్నామన్నారు. అయినప్పటకీ మా వాహనాలను కొంతమంది అడ్డుకుంటున్నారని తెలిపారు. అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు రాఘవ, నవీన్‌ గణేష్‌, నానాజీ, నాయుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement